వృద్ధుడిపై ఖాకీ కావరం.. సస్పెండ్

వృద్ధుడిపై ఖాకీ కావరం.. సస్పెండ్ - Sakshi


లక్నో: వ్యక్తిని కాకపోయినా ఒక్కోసారి ఆయన వయసును గౌరవించాలని అంటుంటారు పెద్దలు. కానీ ఓ ఎస్సై మాత్రం ఆ విలువలను మరిచిపోయి ఓ 65 ఏళ్ల వృద్ధుడిపట్ల కర్కశంగా ప్రవర్తించాడు. అందుకు ఉన్నతాధికారులు ఆ ఎస్సైకి తగిన గుణపాఠం కూడా చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళితే కృష్ణకుమార్(65) అనే వ్యక్తి గత 35 ఏళ్లుగా లక్నోలోని జనరల్ పోస్ట్ ఆఫీస్ బయట ఉన్న ప్లాట్ ఫాంపై కూర్చుని తన పాత టైప్ రైటర్తో చిన్నా చితక పనులు చేసుకుంటు బతుకీడుస్తున్నాడు. కంప్యూటర్ల వాడకం ఎక్కువైన నేటి రోజుల్లో నేడు అతడు కేవలంరూ.50 రావడం గగనమైపోతుంది.ఇదిలా ఉండగా కనీసం ఆయన అనుభవం అంత వయసు కూడా లేని ఓ ఎస్సై అక్కడికి వచ్చిన తన కర్కశాన్ని చూపించాడు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని చెప్పి వెళ్లాడు. ఎప్పటి నుంచో తన బతుకు బండిని అక్కడే ఉండినడుపుకుంటున్న కృష్ణ కుమార్ తిరిగి మరోసారి పనుల్లో నిమగ్నమయ్యాడు. ఈలోగా అక్కడికి మరోసారి వచ్చిన ఎస్సై కోపంగా అక్కడికి వెళ్లి ఆయన్ను అనరాని మాటలని టైప్ రైటర్ని కాలితో తన్నుతూ నానా భీభత్సం చేశాడు. ఈదృశ్యాలను లోకల్ జర్నలిస్టులు చిత్రించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఎస్సై తీరుపట్ల పలువురు భగ్గుమన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వరకు వెళ్లి వెంటనే ఆ ఎస్సైని సస్పెండ్ చేశారు. సదరు పెద్దాయనకు తిరిగి ఓ కొత్త టైప్ రైటర్ను పై అధికారులకు చెప్పి ఇప్పించాడు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top