breaking news
Typewriter
-
జనవరిలో టైప్‌రైటింగ్, షార్ట్‌హ్యాండ్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జనవరిలో టైప్ రైటింగ్, షార్ట్‌హ్యాండ్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించనుందని తెలంగాణ రికగ్నైజ్డ్ టైప్‌రైటింగ్, షార్ట్ హ్యాండ్ అండ్ కంప్యూటర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాలిగ సతీష్‌బాబు తెలిపారు. పరీక్షలను నిర్వహించాలని కోరుతూ గురువారం విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, కార్యదర్శి సి.శ్రీనాథ్‌ను ఆయన కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 22, 23 తేదీల్లో టైప్ రైటింగ్, 29, 30 తేదీల్లో షార్ట్‌హ్యాండ్ పరీక్షలను నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారని సతీష్‌బాబు చెప్పారు. పరీక్ష ఫీజు వచ్చే నెల 29 వరకు పొడిగించారని, ప్రీమియం తత్కాల్ కింద రూ. 5వేలు ఫీజు చెల్లించి పరీక్షకు ముందు రోజు వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారని వివరించారు. -
వృద్ధుడిపై ఖాకీ కావరం.. సస్పెండ్
లక్నో: వ్యక్తిని కాకపోయినా ఒక్కోసారి ఆయన వయసును గౌరవించాలని అంటుంటారు పెద్దలు. కానీ ఓ ఎస్సై మాత్రం ఆ విలువలను మరిచిపోయి ఓ 65 ఏళ్ల వృద్ధుడిపట్ల కర్కశంగా ప్రవర్తించాడు. అందుకు ఉన్నతాధికారులు ఆ ఎస్సైకి తగిన గుణపాఠం కూడా చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళితే కృష్ణకుమార్(65) అనే వ్యక్తి గత 35 ఏళ్లుగా లక్నోలోని జనరల్ పోస్ట్ ఆఫీస్ బయట ఉన్న ప్లాట్ ఫాంపై కూర్చుని తన పాత టైప్ రైటర్‌తో చిన్నా చితక పనులు చేసుకుంటు బతుకీడుస్తున్నాడు. కంప్యూటర్ల వాడకం ఎక్కువైన నేటి రోజుల్లో నేడు అతడు కేవలంరూ.50 రావడం గగనమైపోతుంది. ఇదిలా ఉండగా కనీసం ఆయన అనుభవం అంత వయసు కూడా లేని ఓ ఎస్సై అక్కడికి వచ్చిన తన కర్కశాన్ని చూపించాడు. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని చెప్పి వెళ్లాడు. ఎప్పటి నుంచో తన బతుకు బండిని అక్కడే ఉండినడుపుకుంటున్న కృష్ణ కుమార్ తిరిగి మరోసారి పనుల్లో నిమగ్నమయ్యాడు. ఈలోగా అక్కడికి మరోసారి వచ్చిన ఎస్సై కోపంగా అక్కడికి వెళ్లి ఆయన్ను అనరాని మాటలని టైప్ రైటర్ని కాలితో తన్నుతూ నానా భీభత్సం చేశాడు. ఈదృశ్యాలను లోకల్ జర్నలిస్టులు చిత్రించి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో ఎస్సై తీరుపట్ల పలువురు భగ్గుమన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ వరకు వెళ్లి వెంటనే ఆ ఎస్సైని సస్పెండ్ చేశారు. సదరు పెద్దాయనకు తిరిగి ఓ కొత్త టైప్ రైటర్‌ను పై అధికారులకు చెప్పి ఇప్పించాడు.