ఓటుకు కోట్లు కేసుపై కేసీఆర్ ఆరా | cm kcr enquires about cash for vote scam | Sakshi
Sakshi News home page

ఓటుకు కోట్లు కేసుపై కేసీఆర్ ఆరా

Jul 9 2015 4:17 PM | Updated on Aug 17 2018 12:56 PM

ఓటుకు కోట్లు కేసుపై కేసీఆర్ ఆరా - Sakshi

ఓటుకు కోట్లు కేసుపై కేసీఆర్ ఆరా

ఓటుకు కోట్లు కేసు పురోగతి గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆరా తీసినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను అరెస్టు చేయడం, మరో వ్యక్తి జిమ్మీ బాబు కోసం గాలిస్తున్న నేపథ్యంలో.. కేసు పురోగతి గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆరా తీసినట్లు తెలుస్తోంది. తన క్యాంపు కార్యాలయంలో ఏసీబీ డీజీ ఏకే ఖాన్తో సీఎం కేసీఆర్ చర్చించారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు.

ఇక తెలంగాణ ప్రభుత్వం రంజాన్ మాసం సందర్భంగా ఈనెల 12వ తేదీన నిజాం కాలేజిలో భారీ ఎత్తున ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు పర్యవేక్షణ బాధ్యతలను కూడా సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన ఏకే ఖాన్కే సీఎం కేసీఆర్ అప్పగించారు. దాంతో ఆ విందు గురించి కూడా కేసీఆర్ ఆయనతో చర్చించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement