
ఆనందంగా ఉండేది ఏ నగరవాసులో తెలుసా?
నగరమంటేనే ఏంపని ఉన్నా లేకున్నా తీరిక లేకుండా ఉన్నట్లు, తెగ టెన్షన్ పడిపోతున్నట్లు, గాబరాపడిపోతున్నట్లు కనిపించే చోటు.
న్యూఢిల్లీ: నగరమంటేనే ఏంపని ఉన్నా లేకున్నా తీరిక లేకుండా ఉన్నట్లు, తెగ టెన్షన్ పడిపోతున్నట్లు, గాబరాపడిపోతున్నట్లు కనిపించే చోటు. ఈ క్రమంలో ఆనందమనే రుచిని చూడటం వారికి మిథ్యగానే మారిపోతుంది. అయితే, భారత్ లో అలాంటి టెన్షన్లన్నింటిని పక్కన పెట్టేసి అభివృద్ధిలో కూడా దూసుకెళుతూ అత్యంత ఆనందంగా ఉండే పౌరులతో చంఢీగఢ్ దూసుకెళుతోందట. ఈ విషయాన్ని ఓ సర్వే తెలిపింది. ఇండియాలో అత్యంత ఆనందకరమైన నగరాలు ఏమిటా అని దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ సంస్థ ఈ విషయంపై సర్వే చేయించి జాబితాను ప్రకటించింది.
ఇందులో తొలి వరుసలో చండీగఢ్ ఉండగా.. ఈ జాబితాలో ఆఖరి స్థానంలో గువాహటి నిలిచింది. ఇక మెట్రో పాలిటన్ నగరాల విషయంలో ఢిల్లీ అత్యంత సంతోషకరమైన ప్రజలున్న నగరంగా ఉండగా.. చివరి స్థానంలో ముంబాయి నిలిచింది. ఇక దిక్కులను ఆధారం చేసుకుని ప్రకటించిన జాబితాలో ఉత్తర భాగంలో చండీగఢ్ తొలిస్థానం, జైపూర్ చివరిస్థానం, ఇక తూర్పు దిక్కున తొలిస్ధానం పాట్నా, చివరి స్థానం గువాహటి ఉంది. కాగా, కేరళలోని కొచ్చ నగరం కన్నా హైదరాబాద్ నగర పౌరులే ఎక్కువ సంతోషంగా ఉన్నట్లు కూడా సర్వే తెలిపింది.