
‘కాల్ మనీ’పై సీబీఐ దర్యాప్తు: వీహెచ్
ఏపీలో మహిళల జీవితాలను నాశనం చేస్తున్న కాల్ మనీ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని రాజ్యసభ సభ్యుడు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో మహిళల జీవితాలను నాశనం చేస్తున్న కాల్ మనీ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఏపీ సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు. కాల్ మనీ వ్యవహారం అతి పెద్ద నిర్భయ కేసు అని, దీనిపై బుధవారం రాజ్యసభలో లేవనెత్తుతానని మంగళవారం పేర్కొనారు. మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చే మైక్రో ఫైనాన్సును కొనసాగించి ఉంటే కాల్ మనీ వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. కాల్ మనీ వ్యవహారాల్లో ఎక్కువగా టీడీపీ నేతలే ఉన్నారని ఆరోపించారు.