బీజేపీ ఢిల్లీ సీఎం అభ్యర్థిగా హర్షవర్ధన్ | BJP picks Harsh Vardhan as its CM candidate for Delhi | Sakshi
Sakshi News home page

బీజేపీ ఢిల్లీ సీఎం అభ్యర్థిగా హర్షవర్ధన్

Oct 24 2013 2:26 AM | Updated on Mar 29 2019 9:18 PM

త్వరలోనే జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీనియర్ నేత హర్షవర్ధన్‌ను బీజేపీ బుధవారం ప్రకటించింది.

 న్యూఢిల్లీ: త్వరలోనే జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సీనియర్ నేత హర్షవర్ధన్‌ను బీజేపీ బుధవారం ప్రకటించింది. బీజేపీ ఢిల్లీ నగరశాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ వ్యతిరేకించినా, బీజేపీ పార్లమెంటరీ బోర్డు హడావుడిగా నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ చాలాకాలంగా సీఎం అభ్యర్థిత్వంపై ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో కొన్ని నెలలుగా బీజేపీ నాయకత్వం ఈ అంశంలో డోలాయమానంలో కొనసాగింది. చివరకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్ధన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement