హత్యచేసి గంగా నదిలోకి విసిరేసి.. | Bank Manager Kills Woman and 5-Year-Old, Bodies in Suitcases | Sakshi
Sakshi News home page

హత్యచేసి గంగా నదిలోకి విసిరేసి..

Aug 30 2015 5:33 PM | Updated on Sep 3 2017 8:25 AM

హత్యచేసి గంగా నదిలోకి విసిరేసి..

హత్యచేసి గంగా నదిలోకి విసిరేసి..

పశ్చిమ బెంగాల్లో ఓ బ్యాంకు మేనేజర్ దారుణానికి ఒడిగట్టాడు. ఓ మహిళను, ఆమె కూతురుని హత్య చేసి రెండు సూట్ కేసుల్లో వారి మృత దేహాలను ఉంచి గంగా నదిలో విసిరేసి పోలీసులకు చిక్కాడు.

షెరాపులి: పశ్చిమ బెంగాల్లో ఓ బ్యాంకు మేనేజర్ దారుణానికి ఒడిగట్టాడు. ఓ మహిళను, ఆమె కూతురుని హత్య చేసి రెండు సూట్ కేసుల్లో వారి మృత దేహాలను ఉంచి గంగా నదిలో విసిరేసి పోలీసులకు చిక్కాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం 45 ఏళ్ల సమరేశ్ సర్కార్ అనే వ్యక్తి షెరాపులి వద్ద బ్యాంకు మేనేజర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అతడికి అప్పటికే ఓ భార్య తిటాగఢ్ అనే చోట ఉండగా తాను విధులు నిర్వర్తిస్తున్న చోట సుచేత చక్రవర్తి అనే 34 ఏళ్ల మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.

గత కొంత కాలంగా ఈ వ్యవహారం నడుస్తుండగా ఆమె ఇటీవల తనను వివాహం చేసుకోవాల్సిందిగా సమరేశ్ ను డిమాండ్ చేసింది. దీంతో భార్యకు భయపడిన అతడు సుచేతను, ఆమెకు అప్పటికే ఉన్న ఐదేళ్లపాపను హతమార్చి ఇద్దరి మృతదేహాలను సూట్ కేసులలో పెట్టి గంగా నదిలో విసిరేశాడు. ఇది తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసి వారి మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. అతడిని 12 రోజులపాటు రిమాండ్కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement