చాలాకాలంగా తనను వెంటపడి వేధిస్తున్న ఓ పోకిరీ మీద యాసిడ్ పోసినందుకు బంగ్లాదేశ్లో ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు.
చాలాకాలంగా తనను వెంటపడి వేధిస్తున్న ఓ పోకిరీ మీద యాసిడ్ పోసినందుకు బంగ్లాదేశ్లో ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఖదీముల్ ఇస్లాం (28) అనే చిరు వ్యాపారి ఈ యాసిడ్ డాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో బలియాడంగీ ఉపాజిలా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఖదీమ్ తనను చాలాకాలంగా వేధిస్తున్నాడని, తాను వద్దంటున్నా వినకుండా లైంగిక సంబంధం పెట్టుకోవాలంటూ వెంటపడుతున్నాడని, ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదని అరెస్టయిన మహిళ తెలిపింది.
అతడు చివరకు తన కుటుంబ సభ్యులపై కూడా వేధింపులకు పాల్పడటంతో తాను భరించలేకపోయానని, గత రాత్రి తన గదికి పిలిచానని తెలిపింది. అయితే తాను ఒప్పుకొన్నట్లు భావించిన అతడు వెంటనే రావడంతో గది తలుపులు మూసి అతడిపై యాసిడ్ పోసినట్లు వివరించింది. అతడి అరుపులు విన్న ఇరుగుపొరుగు వాళ్లు వెంటనే వచ్చి, అతడిని ఆస్పత్రికి తరలించారు. యాసిడ్ దాడిలో అతడి శరీరం, పురుషాంగాలు కూడా బాగా కాలిపోయినట్లు పోలీసులు చెప్పారు.