‘ఎన్డీటీవీ’ నిలిపివేత ఆదేశాలపై నిరసనలు | Ban On NDTV Channel Shows Emergency-Like Attitude: Mamata Banerjee | Sakshi
Sakshi News home page

‘ఎన్డీటీవీ’ నిలిపివేత ఆదేశాలపై నిరసనలు

Nov 5 2016 1:10 AM | Updated on Sep 4 2017 7:11 PM

పఠాన్‌కోట్ దాడిపై ప్రసారాలు చేసినందుకు ‘ఎన్డీటీవీ ఇండియా’ హిందీ న్యూస్ చానల్ ను నవంబర్ 9న నిలిపివేయాలన్న ఆదేశాల్ని విపక్షాలు,

న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ దాడిపై ప్రసారాలు చేసినందుకు ‘ఎన్డీటీవీ ఇండియా’ హిందీ న్యూస్ చానల్ ను నవంబర్ 9న నిలిపివేయాలన్న ఆదేశాల్ని విపక్షాలు, మీడియా సంస్థలు  ఖండించాయి. సమాచార ప్రసార శాఖకు చెందిన అంతర్ మంత్రిత్వ శాఖ విచారణ బృందం ఆదేశాల పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో పాటు ఎమర్జెన్సీ రోజులు గుర్తు కొస్తున్నాయంటూ మండిపడ్డాయి. ప్రసారాల నిలుపుదలపై ఇచ్చిన ఆదేశాల్ని తక్షణం ఉపసంహరించుకోవాలన్నాయి. దేశంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు నెలకొన్నాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమత, ఈ ఆదేశాలు దిగ్భ్రాంతికర  పరిణామంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ పేర్కొన్నారు. ఐబీ ఉత్తర్వుల్ని ఖండించడంతో పాటు ఇది పత్రికా స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా. బ్రాడ్‌కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ పేర్కొన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement