మ్యాగీ నూడుల్స్ పై నిషేధం ఎత్తివేత! | Ban on Maggi Noodles Removed in Gujarat and Karnataka: Reports | Sakshi
Sakshi News home page

మ్యాగీ నూడుల్స్ పై నిషేధం ఎత్తివేత!

Oct 19 2015 5:48 PM | Updated on Oct 8 2018 4:21 PM

మ్యాగీ నూడుల్స్ పై నిషేధం ఎత్తివేత! - Sakshi

మ్యాగీ నూడుల్స్ పై నిషేధం ఎత్తివేత!

గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలలో మ్యాగీ నూడుల్స్ పై నిషేధం ఎత్తివేసినట్టు తెలుస్తున్నది.

న్యూఢిల్లీ: గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలలో మ్యాగీ నూడుల్స్ పై నిషేధం ఎత్తివేసినట్టు తెలుస్తున్నది. మ్యాగీ నూడుల్స్ నమూనాలను ఇటీవల పరీక్షించి.. సురక్షితమని తేల్చిన నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

మ్యాగీ నూడుల్స్ లో ప్రమాదకరమైన, సురక్షితం కాని పదర్థాలు ఉన్నాయని పరీక్షల్లో తేలడంతో వాటిపై భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఐ) నిషేధం విధించింది. దీంతో గత జూన్లో నెస్ట్లే ఇండియా సంస్థ మ్యాగీకి చెందిన అన్ని రకాల నూడుల్స్ ను మార్కెట్ నుంచి వెనుక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో ముంబై హైకోర్టు ఆదేశాల మేరకు మూడు ప్రయోగశాలల్లో మ్యాగీ నూడుల్స్ శాంపిల్స్ పరీక్షించామని, ఈ పరీక్షల్లో అవి సురక్షితమని తేలిందని నెస్ట్లే ఇండియా గత శుక్రవారం ప్రకటించింది. దీంతో గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో మ్యాగీ నూడుల్స్ పై నిషేధం ఎత్తివేసినట్టు వార్తలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement