ఎలుక తల కొరికి.. మూడు పెగ్గులేశాడు! | Australian man bites off live rat's head, banned from owning pets for 3 years | Sakshi
Sakshi News home page

ఎలుక తల కొరికి.. మూడు పెగ్గులేశాడు!

Jul 11 2016 1:44 PM | Updated on Sep 4 2017 4:37 AM

ఎలుక తల కొరికి.. మూడు పెగ్గులేశాడు!

ఎలుక తల కొరికి.. మూడు పెగ్గులేశాడు!

బతికున్న ఎలుక తలను కొరికి తిని, మూడు పెగ్గులు వోడ్కా తీసుకున్న వ్యక్తికి..

సిడ్నీ: బతికివున్న తెల్ల ఎలుక తలను కొరికి తిన్న వీడియోను చిత్రించుకుని ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేసిన వ్యక్తిని మూడేళ్ల పాటు పెంపుడు జంతువులను పెంచకూడదని, బదులుగా సామాజిక సేవ చేయాలని ఆ దేశ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి నెలలో మాథ్యూ మలోనీ(25) ఎలుకను కొరికి చంపిన వీడియోను ఆన్ లైన్ లో పోస్టు చేశాడు. ఆ వీడియోలో మలోనీ గదిలోకి ఓ తెల్ల ఎలుక తీసుకుని వెళ్లాడు. ఎలుకను తన నోట్లో పెట్టుకుని  గట్టిగా దాని తల తెగిపోయేవరకూ కొరికాడు. ఆ తర్వాత నోటికి అంటుకున్న రక్తాన్నికడిగేందుకు మూడు పెగ్గులు వాడ్కాను ఉపయోగించినట్లు తెలుస్తోంది.

ఈ వీడియో ఫేస్ బుక్ లో పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే వైరల్ కావడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని  మేజిస్ట్రేట్ కోర్టులో హజరుపరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తులు మూగజీవాలపై రాక్షసత్వాన్ని ప్రదర్శించిన అతనికి 100 గంటలపాటు సామాజిక సేవ చేయాలని శిక్షను విధించారు.

Advertisement
 
Advertisement
Advertisement