అస్సాంలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం | Assam Police seize explosives, arrest two | Sakshi
Sakshi News home page

అస్సాంలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

Nov 16 2013 4:39 PM | Updated on Aug 25 2018 5:33 PM

అస్పాంలోని కమలాపుర్ పట్టణంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భాగంగా భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారి రాకేష్ రోషన్ శనివారం ఇక్కడ వెల్లడించారు.

అస్పాంలోని కమలాపుర్ పట్టణంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భాగంగా భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారి రాకేష్ రోషన్ శనివారం ఇక్కడ వెల్లడించారు. ఆ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు చెప్పారు. పట్టణంలోని కొన్ని ప్రాంతంలో గత కొద్ది రోజులుగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నట్లు సమాచారం అందిందని, ఈ నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

 

ఆ క్రమంలో చేపట్టిన తనిఖీల్లో భాగంగా భారీగా పేలుడు పదార్ధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రాకేష్ రోషన్ చెప్పారు. రెండు కిలోల టీఎన్టీ, ఐదు కేజీల ఆర్డీఎక్స్, 20 కేజీల అమ్మెనియం నైట్రేట్, 64 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్ని సీజ్ చేసినట్లు ఉన్నతాధికారి రోషన్ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement