breaking news
TNT
-
జాతీయ రహదారి వద్ద పేలుడు పదార్థం స్వాధీనం
ఉద్దంపూర్ : జమ్మూ కాశ్మీర్ ఉద్దంపూర్ జిల్లా ఖేరి ప్రాంతంలో జమ్మూ - శ్రీనగర్ జాతీయ రహదారి సమీపంలో ఉన్న భారీ ఎత్తున టీఎన్టీ పేలుడు పదార్థాన్ని సీఆర్పీఎఫ్ దళాలు మంగళవారం గుర్తించాయి. ఆ పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశాయి. జాతీయ రహదారిపై పడిన కొండ చరియలు తొలగించే క్రమంలో ఈ టీఎన్టీని కనుగొన్నట్లు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు. దీనిపై విచారణ జరగుతుందని చెప్పారు. -
అస్సాంలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
అస్పాంలోని కమలాపుర్ పట్టణంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భాగంగా భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారి రాకేష్ రోషన్ శనివారం ఇక్కడ వెల్లడించారు. ఆ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు చెప్పారు. పట్టణంలోని కొన్ని ప్రాంతంలో గత కొద్ది రోజులుగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు సాగుతున్నట్లు సమాచారం అందిందని, ఈ నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆ క్రమంలో చేపట్టిన తనిఖీల్లో భాగంగా భారీగా పేలుడు పదార్ధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రాకేష్ రోషన్ చెప్పారు. రెండు కిలోల టీఎన్టీ, ఐదు కేజీల ఆర్డీఎక్స్, 20 కేజీల అమ్మెనియం నైట్రేట్, 64 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్ని సీజ్ చేసినట్లు ఉన్నతాధికారి రోషన్ వివరించారు.