అసదుద్దీన్ ఒవైసీ అరెస్ట్; విడుదల | asaduddin owaisi arrested, released on bail | Sakshi
Sakshi News home page

అసదుద్దీన్ ఒవైసీ అరెస్ట్; విడుదల

Oct 28 2015 5:59 PM | Updated on Sep 3 2017 11:38 AM

అసదుద్దీన్ ఒవైసీ అరెస్ట్; విడుదల

అసదుద్దీన్ ఒవైసీ అరెస్ట్; విడుదల

ఎంఐఎం నాయకుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని బిహార్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.

పూర్ణియా: ఎంఐఎం నాయకుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని బిహార్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పూర్ణియా జిల్లాలోని బైసీ ప్రాంతంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఆయనను బెయిల్ పై విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు అసద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్ గంజ్ లో నిర్వహించిన ర్యాలీలో మోదీపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బైసీలో అనుమతి లేకుండా ఎన్నికల సభ పెట్టారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఫేస్ బుక్ లో అసదుద్దీన్ చేసిన పోస్టింగ్ లపైనా కేసు నమోదైంది. తన ఇమేజ్ ను దెబ్బతీసేలా ఫొటోలు పెట్టారని బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథన్ కేసు పెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement