ఆ ఇంట్లో ఆయుధాల తయారీ మెషీన్! | Arrows, Guns, Swords. Doctor Hid Huge Stash Of Weapons At Raipur Home | Sakshi
Sakshi News home page

ఆ ఇంట్లో ఆయుధాల తయారీ మెషీన్!

Aug 29 2016 4:37 PM | Updated on Sep 4 2017 11:26 AM

అక్రమంగా ఆయుధాలను నిల్వచేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

రాయ్ పూర్: అక్రమంగా ఆయుధాలను నిల్వ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. హోమియోపతి డాక్టర్ గా సేవలందిస్తున్న డా.అనిరుద్ధ చటర్జీ పెద్ద ఎత్తున ఆయుధాలను దాచిపెట్టినట్లు సమాచారం అందుకున్న రాయ్ పూర్ పోలీసులు  సోమవారం అతడి ఇంటిపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో చటర్జీ ఇంటిలోని మూడో అంతస్తులో పెద్ద ఎత్తున ఉంచిన బాణాలు, కత్తులు, తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

రెండు రోజుల క్రితం అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి నుంచి పోలీసులు ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారంతో చటర్జీ ఇంటిపై దాడి చేసిన పోలీసులు ఆయుధాలు తయారుచేసే మెషీన్ ను గుర్తించినట్లు సమాచారం. చటర్జీకి మావోయిస్టులతో ఏవైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement