లెక్కల్లోనూ వాళ్లే 'మహారాణులు' | Are men really better than women at maths? | Sakshi
Sakshi News home page

లెక్కల్లోనూ వాళ్లే 'మహారాణులు'

Jun 24 2015 2:47 PM | Updated on Sep 3 2017 4:18 AM

లెక్కల్లోనూ వాళ్లే 'మహారాణులు'

లెక్కల్లోనూ వాళ్లే 'మహారాణులు'

అబ్బాయిల్లో చాలామంది సైన్స్, ఇంజనీరింగ్ లాంటి కెరీర్ ఎంచుకుంటారు. మరి వీళ్లు లెక్కలు చేయడంలో అమ్మాయిల కంటే ముందుంటామని ఫీలింగా? పొరపాటున అలాంటిది ఏమైనా ఉంటే వెంటనే తుడిచేసుకోండి.

అబ్బాయిల్లో చాలామంది సైన్స్, ఇంజనీరింగ్ లాంటి కెరీర్ ఎంచుకుంటారు. మరి వీళ్లు లెక్కలు చేయడంలో అమ్మాయిల కంటే ముందుంటామని ఫీలింగా? పొరపాటున అలాంటిది ఏమైనా ఉంటే వెంటనే తుడిచేసుకోండి. ఎందుకంటే.. లెక్కలు చేయడంలో కూడా మహిళలే మహారాణులన్న విషయం తాజాగా ఓ పరిశోధనలో తేలింది. తాము లెక్కలు బాగా చేయగలమని మగాళ్లు 'అనుకుంటారు' తప్ప.. నిజానికి వాళ్లేమీ అంత గొప్పోళ్లు కారని తేల్చిచెప్పేశారు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన షేన్ బెంచ్ ఈ పరిశోధనకు నేతృత్వం వహించారు.

అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథమెటిక్స్ (స్టెమ్) సబ్జెక్టులను ఎంచుకునేవాళ్లలో మగవాళ్లు, ఆడవాళ్ల సంఖ్య మధ్య చాలా ఎక్కువ వ్యత్యాసం ఉంటోంది. ఎలిమెంటరీ స్కూలు స్థాయిలో కూడా లెక్కల పరీక్షల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందుంటున్నారు. ఈ విషయంలో నిజాలను నిగ్గుతేల్చేందుకు మొత్తం 122 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను, మరో 184 మంది ఇతరులను పరిశీలించారు. రెండు గ్రూపులుగా చేసి పరిశీలించగా, రెండింటిలోనూ అబ్బాయిలు తాము ఎన్ని లెక్కలు చేయగలమనే సంఖ్యను ఎక్కువగా అంచనా వేసుకుని.. అందులో తప్పారు. మహిళలు మాత్రం సరిగ్గా ఎన్ని చేయగలమో అన్నే తీసుకుని సరిగ్గా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement