
స్టడీ
యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషనల్ మానిటరింగ్ ‘జెమ్’ నివేదిక ప్రకారం స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమేటిక్స్) ఫీల్డ్‌లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ‘స్టెమ్’ గ్రాడ్యుయేట్స్‌లో మహిళలు కేవలం 35 శాతం మాత్రమే ఉన్నారు. గత పది సంవత్సరాలుగా ఈ జెండర్ గ్యాప్‌ను తగ్గించడంలో ఎలాంటి పురోగతీ లేదు.
మ్యాథ్‌మేటిక్స్‌లాంటి సబ్జెక్ట్‌లో బాలురతో సమానంగా అమ్మాయిలు ప్రతిభ చూపుతున్నప్పటికీ, అంతకంటే ఎక్కువ ప్రతిభ ఉన్నప్పటికీ తమ మీద తమకు విశ్వాసం లేక΄ోవడం నుంచి మొదలు రకరకాల ఆటంకాలు ‘స్టెమ్’లో మహిళలప్రొతినిధ్యం తక్కువ ఉండడానికి కారణం అవుతున్నాయి.
‘జెమ్’ డేటా ప్రకారం డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో 26 శాతం మంది ప్రొఫెషనల్స్ మాత్రమే మహిళలు. ‘క్లౌడ్ కంప్యూటింగ్’లాంటి స్పెషలైజ్‌డ్ ఫీల్డ్‌లలో ఈ సంఖ్య మరింత తక్కువగా ఉంది.
‘స్టెమ్’ ఎడ్యుకేషన్‌కి సంబంధించి 68 శాతం దేశాలు ్ర΄ోత్సాహక విధానాలు రూపొందించినప్పటికీ వాటిలో సగం మాత్రమే మహిళలను ఎంకరేజ్ చేసే ప్రత్యేక విధానాలు ఉన్నాయి. స్టెమ్ ఎడ్యుకేషన్‌లో మహిళల ప్రొతినిధ్యాన్ని పెంచడానికి ‘జెమ్’ కొన్ని సూచనలు చేసింది.
ఉదా: లింగవివక్షతను గుర్తించి, అరికట్టడానికి అవసరమైన శిక్షణను టీచర్‌లు, స్కూల్ లీడర్‌లకు ఇవ్వాలి.
∙మహిళల నాయకత్వంలో ‘స్టెమ్’ క్లబ్‌లను ఏర్పాటు చేయాలి
క్లాస్‌రూమ్‌లో జెండర్–న్యూట్రల్ లాంగ్వేజ్‌ని ఉపయోగించేలా చూడాలి
అమ్మాయిల ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ‘స్టెమ్’ ఎక్స్‌పర్ట్‌లతో క్లాసులో ఉపన్యాసాలు ఇప్పించాలి.