రూ.4 వేల కంటే తక్కువకు ఐఫోన్ | Apple iPhone 6 available for less than Rs 4,000 on Flipkart under new exchange offer | Sakshi
Sakshi News home page

రూ.4 వేల కంటే తక్కువకు ఐఫోన్

Feb 7 2017 7:46 PM | Updated on Aug 1 2018 3:40 PM

రూ.4 వేల కంటే తక్కువకు ఐఫోన్ - Sakshi

రూ.4 వేల కంటే తక్కువకు ఐఫోన్

మరోసారి ఆపిల్ పాత ఐఫోన్ 6పై ఫ్లిప్కార్ట్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది.

మరోసారి ఆపిల్ పాత ఐఫోన్ 6పై ఫ్లిప్కార్ట్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. కొత్త ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ.24వేల డిస్కౌంట్ ప్రకటిస్తూ రూ.3990కే ఆపిల్ ఐఫోన్ 6(స్పేస్ గ్రే, 16జీబీ వెర్షన్)ను విక్రయించనున్నామని ఫ్లిప్కార్ట్ తెలిపింది. ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్పై రూ.27,990కు అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ కింద రూ.24వేల డిస్కౌంట్ను ఫ్లిప్కార్ట్ ఆఫర్ చేస్తోంది. అదనంగా ఈఎంఐను అందుబాటులో ఉంచిన ఫ్లిప్కార్ట్, బ్యాంకు కార్డులపై ఇతర డిస్కౌంట్లను 5 శాతం ఆఫర్ చేస్తోంది.
 
అయితే ఐఫోన్6 స్పేస్ గ్రే, 16జీబీ వెర్షన్ను రూ.3990కే కొనుగోలు చేయదలుచుకున్న వారు తమ కొత్త ఐఫోన్ 6ఎస్ ప్లస్తో ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. 16జీబీ ఐఫోన్ 6ను ఐఫోన్ 6ఎస్ ప్లస్తో ఎక్స్చేంజ్ చేసుకునేవారికి కచ్చితంగా ఈ డిస్కౌంట్ను అందించనున్నట్టు ఫ్లిప్కార్ట్ భరోసా ఇస్తోంది.  గణతంత్ర దినోత్సవ సందర్భంగా కూడా ఐఫోన్ 6 ఫోన్పై ఫ్లిప్కార్ట్ భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement