‘గ్రీన్‌హౌస్’లోకి మరో 17 కంపెనీలు | Another 17 companies in 'Greenhouse' | Sakshi
Sakshi News home page

‘గ్రీన్‌హౌస్’లోకి మరో 17 కంపెనీలు

Nov 27 2015 1:02 AM | Updated on Sep 3 2017 1:04 PM

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో గ్రీన్‌హౌస్ (పాలీహౌస్) నిర్మించేందుకు మరి కొన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి.

జాబితాకు ప్రభుత్వం ఆమోద ముద్ర
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో గ్రీన్‌హౌస్ (పాలీహౌస్) నిర్మించేందుకు మరి కొన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి. కొత్తగా 17 కంపెనీలతో తయారైన జాబితాకు ఆమోదం తెలుపుతూ వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 847 ఎకరాల్లో గ్రీన్‌హౌస్ నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్లో రూ. 250 కోట్లు కేటాయించారు. కానీ బడ్జెట్ సొమ్ము విడుదలైనా కంపెనీల నుంచి, రైతుల నుంచి పెద్దగా స్పందన రాలే దు. ఇప్పటివరకు 5 కంపెనీలు జాబితాలో ఉండగా... వాటిల్లో ఒకట్రెండు మాత్రమే నిర్మాణాలు చే స్తున్నాయి.

ఇప్పటివరకు 20 ఎకరాల్లోనే గ్రీన్‌హౌస్ నిర్మాణాలు జరిగాయి. దీంతో ఈ పథకం మూలన పడింది. ఈ పరిస్థితుల్లో అధికారుల్లో ఆలోచన మొదలైంది. నిబంధనల ను కాస్తంత సడలించి కొత్త కంపెనీలను ఆహ్వానించారు. కంపెనీలు రూ.50 లక్షలు బ్యాంకు సెక్యూరిటీ డిపాజిట్ చూపించాల్సి వచ్చేది. దీన్ని తాజాగా సర్కారు రూ.2 లక్షలకు కుదిం చింది. డిపాజిట్ భారీగా తగ్గించడంతో దేశవ్యాప్తంగా అనేక కంపెనీలు ముందుకు వచ్చినట్లు ఉద్యానశాఖ వర్గాలు తెలిపాయి.

దరఖాస్తు చేసుకున్న వాటిలో 17 కంపెనీలతో జాబితా రూపొందించారు. అంతేకాకుండా గ్రీన్‌హౌస్ నిర్మాణానికి సంబంధించి సాంకేతికంగా అనేక మార్పులు చేశారు. కంపెనీలకు సంబంధం లేకుండా సబ్సిడీ సొమ్మును నేరుగా రైతులకే చెల్లించేలా సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిం దే. జాబితాలో ఉన్న కంపెనీల్లో ఇష్టమైన వాటిని ఎంచుకునే స్వేచ్ఛ రైతులకు కల్పిం చారు.

గ్రీన్‌హౌస్ నిర్మాణ వ్యయంలో సర్కారు మూడు విడతలుగా సబ్సిడీ సొమ్మును రైతు ఖాతాలో వేస్తుంది. గ్రీన్‌హౌస్‌కు పునాది వేసి, కంపెనీ నుంచి మెటీరియల్ సరఫరా అయ్యాక 35 శాతం సొమ్ము రైతు ఖాతాలో వేస్తారు. గ్రీన్‌హౌస్ నిర్మాణం పూర్తయి తనిఖీ చేశాక రెండో విడతలో 50 శాతం సొమ్మును రైతుకు చెల్లిస్తారు. థర్డ్ పార్టీ విచారణ అనంతరం మిగిలిన 15 శాతం సొమ్మును రైతుకు అందజేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement