breaking news
Greenhouse structures
-
నిలిచిపోయిన గ్రీన్హౌస్ నిర్మాణ పనులు
- పెద్ద నోట్ల రద్దుతో చేతులెత్తేసిన కంపెనీలు - అప్పులు చేసి రూ. లక్షలు తెచ్చుకున్న అన్నదాతలు... - వాటి మార్పిడిలో ఇబ్బందులు - మరోవైపు సబ్సిడీ రూ. 244 కోట్లు ఇవ్వకుండా చెయిచ్చిన సర్కారు సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల వ్యవహా రంతోపాటు ప్రభుత్వ చెల్లింపులు జరపక అనేకచోట్ల గ్రీన్హౌస్ నిర్మాణాలు తాత్కాలి కంగా నిలిచిపోయాయి. గ్రీన్హౌస్ నిర్మా ణం ఎకరాకు రూ. 40 లక్షల వరకు ఖర్చు అవుతుండటంతో రైతులు అదేస్థాయిలో నగదు సొమ్మును పాత రూ. 500, వెయ్యి నోట్లతో దగ్గర ఉంచుకున్నారు. అంత సొమ్మును బ్యాంకుల్లో మార్చుకోవడమూ కష్టసాధ్యంగా ఉండటంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. రైతుల నుంచి కొత్త నోట్లు అందక కంపెనీలు అనేకచోట్ల తాత్కాలికంగా పనులు నిలిపివేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నారుు. చాలామంది వ్యాపారులు, ధనిక రైతులే గ్రీన్హౌస్ వైపు మొగ్గుచూపారు. భారీగా సొమ్ము దగ్గర ఉండటంతో వాటిని తమ బ్యాంకు ఖాతాల్లో వేయాలంటే ఆదాయపు పన్నుశాఖ నుంచి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనిపై స్పష్టత ఇవ్వకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ బకాయి... మరోవైపు పెద్ద నోట్ల రద్దు రాష్ట్రంలో గ్రీన్హౌస్ ద్వారా పెద్ద ఎత్తున కూరగాయలు, పూల దిగుబడులను పెంచాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. గ్రీన్హౌస్ను రైతుల్లోకి తీసుకెళ్లేందుకు భారీ సబ్సిడీని ప్రభుత్వం ప్రకటించింది. ఒక ఎకరంలో గ్రీన్హౌస్ నిర్మాణం చేపట్టడానికి రూ. 40 లక్షల వరకు ఖర్చు అరుుతే సబ్సిడీ కింద ప్రభుత్వమే రూ.30 లక్షలు భరిస్తుంది. ఇక ఎస్సీ, ఎస్టీలకు 95% సబ్సిడీగా ప్రభుత్వం నుంచి రూ. 38 లక్షలు భరిస్తుంది. దీంతో కొందరు రైతులు తమ వాటాను ముందుగానే కంపెనీలకు చెల్లించారు. ఇంకొందరు కొంత చెల్లించి మరికొంత చెల్లించేందుకు అప్పులు కూడా చేశారు. ప్రభుత్వం నుంచి వివిధ దశల్లో సబ్సిడీ సొమ్ము రాకపోవడంతో దాన్నీ సొంతంగా చెల్లించేందుకు నగదు సిద్ధం చేసుకున్నారు. ఇంతలోనే పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో వాటిని మార్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్లలో ప్రభుత్వం రైతులకు సబ్సిడీ కోసం రూ. 450 కోట్లు కేటారుుంచింది. కానీ ఇప్పటివరకు రూ. 58.50 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఈ రెండేళ్లలో ఇప్పటివరకు విడుదల చేయాల్సిన దాంతో పోలిస్తే ప్రభుత్వం రైతులకు రూ. 244.64 కోట్లు బకారుు పడింది. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 95%, ఇతరులకు 75% సబ్సిడీ ప్రకటించడంతో అనేకమంది ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఎస్సీ, ఎస్టీలు కూడా పెద్ద నోట్ల రద్దు... సర్కారు బకారుులతో లబోదిబోమంటున్నారు. దీంతో కంపెనీలు కూడా మధ్యలోనే పనులు వదిలేసి పోయారుు. -
‘గ్రీన్హౌస్’లోకి మరో 17 కంపెనీలు
జాబితాకు ప్రభుత్వం ఆమోద ముద్ర సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో గ్రీన్హౌస్ (పాలీహౌస్) నిర్మించేందుకు మరి కొన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి. కొత్తగా 17 కంపెనీలతో తయారైన జాబితాకు ఆమోదం తెలుపుతూ వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 847 ఎకరాల్లో గ్రీన్హౌస్ నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్లో రూ. 250 కోట్లు కేటాయించారు. కానీ బడ్జెట్ సొమ్ము విడుదలైనా కంపెనీల నుంచి, రైతుల నుంచి పెద్దగా స్పందన రాలే దు. ఇప్పటివరకు 5 కంపెనీలు జాబితాలో ఉండగా... వాటిల్లో ఒకట్రెండు మాత్రమే నిర్మాణాలు చే స్తున్నాయి. ఇప్పటివరకు 20 ఎకరాల్లోనే గ్రీన్హౌస్ నిర్మాణాలు జరిగాయి. దీంతో ఈ పథకం మూలన పడింది. ఈ పరిస్థితుల్లో అధికారుల్లో ఆలోచన మొదలైంది. నిబంధనల ను కాస్తంత సడలించి కొత్త కంపెనీలను ఆహ్వానించారు. కంపెనీలు రూ.50 లక్షలు బ్యాంకు సెక్యూరిటీ డిపాజిట్ చూపించాల్సి వచ్చేది. దీన్ని తాజాగా సర్కారు రూ.2 లక్షలకు కుదిం చింది. డిపాజిట్ భారీగా తగ్గించడంతో దేశవ్యాప్తంగా అనేక కంపెనీలు ముందుకు వచ్చినట్లు ఉద్యానశాఖ వర్గాలు తెలిపాయి. దరఖాస్తు చేసుకున్న వాటిలో 17 కంపెనీలతో జాబితా రూపొందించారు. అంతేకాకుండా గ్రీన్హౌస్ నిర్మాణానికి సంబంధించి సాంకేతికంగా అనేక మార్పులు చేశారు. కంపెనీలకు సంబంధం లేకుండా సబ్సిడీ సొమ్మును నేరుగా రైతులకే చెల్లించేలా సర్కారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిం దే. జాబితాలో ఉన్న కంపెనీల్లో ఇష్టమైన వాటిని ఎంచుకునే స్వేచ్ఛ రైతులకు కల్పిం చారు. గ్రీన్హౌస్ నిర్మాణ వ్యయంలో సర్కారు మూడు విడతలుగా సబ్సిడీ సొమ్మును రైతు ఖాతాలో వేస్తుంది. గ్రీన్హౌస్కు పునాది వేసి, కంపెనీ నుంచి మెటీరియల్ సరఫరా అయ్యాక 35 శాతం సొమ్ము రైతు ఖాతాలో వేస్తారు. గ్రీన్హౌస్ నిర్మాణం పూర్తయి తనిఖీ చేశాక రెండో విడతలో 50 శాతం సొమ్మును రైతుకు చెల్లిస్తారు. థర్డ్ పార్టీ విచారణ అనంతరం మిగిలిన 15 శాతం సొమ్మును రైతుకు అందజేస్తారు.