గోదావరి పుష్కరాలకు రావాలని ఆంధ్రప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించింది.
హైదరాబాద్: గోదావరి పుష్కరాలకు రావాలని ఆంధ్రప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించింది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎంలకు ఆహ్వానించింది.
ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆయా పార్టీల నేతలకు ఫోన్లు చేసి ఆహ్వానించారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో మంగళవారం ఉదయం గోదావరి పుష్కరాలను ప్రారంభించనున్నారు.