ఒక జత బట్టలు మాత్రమే ఉన్నాయి: సీఎం | Amit Shah suddenly told me that you've to become UP CM tomorrow, says CM Yogi Adityanath | Sakshi
Sakshi News home page

ఒక జత బట్టలు మాత్రమే ఉన్నాయి: సీఎం

Mar 29 2017 7:51 PM | Updated on Sep 5 2017 7:25 AM

ఒక జత బట్టలు మాత్రమే ఉన్నాయి: సీఎం

ఒక జత బట్టలు మాత్రమే ఉన్నాయి: సీఎం

తాను ముఖ్యమంత్రి అవుతానని అనుకోలేదని యోగి ఆదిత్యనాథ్‌ పేర్కొన్నారు.

లక్నో: ప్రధాని నరేంద్ర మోదీపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన నుంచి గొప్ప విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. ‘ఈ రోజుల్లో సన్యాసులకు ప్రజలు భిక్ష కూడా వేయడం లేదు. ప్రధాని మోదీ ఏకంగా నాకు ఉత్తరప్రదేశ్‌ ఇచ్చారు. సానుకూలంగా ఎలా ఆలోచించాలి, గొప్ప పనులు ఏవిధంగా చేయాలనేది ఆయన నుంచి నేర్చుకున్నాన’ని సీఎం యోగి చెప్పారు.

తాను ముఖ్యమంత్రి అవుతానని అనుకోలేదని పేర్కొన్నారు. ‘రేపు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ప్రమాణ స్వీకారానికి ముందురోజు అమిత్‌ షా నాతో చెప్పారు. హఠాత్తుగా అలా చెప్పడంతో ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నా దగ్గర ఒక జత బట్టలు మాత్రమే ఉన్నాయ’ని వెల్లడించారు. పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడబోనని స్పష్టం చేశారు. యూపీ పట్టిన రోగం ఏంటో తనకు తెలుసునని, దాన్ని వదిలించేందుకు ప్రయత్నిస్తానని సీఎం యోగి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement