
బీజేపీ అధ్యక్ష పీఠంపై అమిత్ షా
ప్రధాని నరేంద్ర మోడీకి సన్నిహితుడు, బీజేపీ ప్రధాన కార్యదర్శి అమిత్ షా, ఆ పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడుగా ఎంపికయ్యారు.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి సన్నిహితుడు, బీజేపీ ప్రధాన కార్యదర్శి అమిత్ షా, ఆ పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడుగా ఎంపికయ్యారు. అమిత్ షా నియామకానికి బీజేపీ పార్లమెంటరీ బోర్డు బుధవారం ఆమోద ముద్రవేసింది. అమిత్ షా పేరును ప్రస్తుత అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. అమిత్ షా నియామకం ద్వారా పార్టీపై నరేంద్ర మోడీ పూర్తి సాధించినట్టయింది. అధ్యక్షుడిగా ఎంపికైన అమిత్ షాకు సీనియర్ నేతలు అభినందనలు తెలిపారు.
కాగా సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఉత్తరప్రదేశ్ బాధ్యతలు చేపట్టిన అమిత్‌షా 80 సీట్లకుగానూ 71 స్థానాల్లో విజయం సాధించి పెట్టారు. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర, హర్యానాతోపాటు వచ్చే ఏడాది ఆరంభంలో జార్ఖండ్, జమ్మూకాశ్మీర్ అసెంబ్లీల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయ పరంపరను కొనసాగించడానికి అమిత్‌షాకే అధ్యక్ష పీఠం కట్టబెట్టింది.