
ఆల్టో కె10 కొత్త వెర్షన్ లాంచ్ చేసిన ధోనీ
మినీ కారు సెగ్మెంట్‌లో తన మార్కెట్ వాటాను మరింతగా పెంచుకునే లక్ష్యంతో మారుతి సుజుకీ ఆల్టో కె10 మోడల్‌లో సరికొత్త వెర్షన్‌ను హైదరాబాద్ లో లాంచ్ చేసింది.
మినీ కారు సెగ్మెంట్‌లో తన మార్కెట్ వాటాను మరింతగా పెంచుకునే లక్ష్యంతో మారుతి సుజుకీ ఆల్టో కె10 మోడల్‌లో సరికొత్త వెర్షన్‌ను హైదరాబాద్ లో లాంచ్ చేసింది. ప్రముఖ క్రికెటర్ , కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చేతులు మీదుగా గ్రాండ్ గా విడుదలైంది. కొత్తగా ముస్తాబైన సరికొత్త ఆల్టో కె10 ధర2. 5 లక్షల రూపాయల నుంచి 4.5 లక్షల రూపాయల వరకు ఉండనుందని కంపెనీ ప్రకటించింది. కరెంట్ మోడల్ తో పోలిస్తే ఇది కొంచెం ధర ఎక్కువని తెలిపింది.
ఆటోమేటెడ్ గేర్ షిఫ్ట్ సదుపాయంతో, 7 సీట్లతో కొత్తగా లాంచ్ అయిన ఈ 'కూల్ ఆల్టో కె10' తమకు కీలకమైన ఉత్పత్తి కంపెనీ వెల్లడించింది. సరికొత్త టెక్నాలజీ, విలువకు తగిన కారు కావాలనుకునే కస్టమర్లను ఇది ఆకట్టుకోనుందని మారుతి సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్) ఆర్‌ఎస్ కల్సి తెలిపారు. ఈ సందర్భంగా ధోనీ తన బయోపిక్ ముచ్చట్లను పంచుకున్నారు. మరో వైపు ముత్యాల నగరం హైదరాబాద్ లో ధోనీ తమ కార్యక్రమానికి హాజరు కావడం సంతోషంగా ఉందని కంపెనీ ట్వీట్ చేసింది.
M.S. Dhoni @msdhoni has joined us at the venue in the City of Pearls, Hyderabad, to unveil the big surprise. @DhoniBiopic #DrivenByPassion
— Alto 800 (@Alto_800) September 24, 2016