ప్రధాని కోటలోనూ మాదే విజయం | Alliance With Congress Working at Ground Level, Says Akhilesh Yadav | Sakshi
Sakshi News home page

ప్రధాని కోటలోనూ మాదే విజయం

Mar 1 2017 12:27 PM | Updated on Mar 18 2019 9:02 PM

ప్రధాని కోటలోనూ మాదే విజయం - Sakshi

ప్రధాని కోటలోనూ మాదే విజయం

సమాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకోవడం ఇద్దరికీ కలసి వస్తుందని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్ అన్నారు.

అజాంగఢ్‌: సమాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకోవడం ఇద్దరికీ కలసి వస్తుందని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్ అన్నారు. యూపీ ఎన్నికల ప్రచారంలో తీరికలేకుండా ప్రచారం చేస్తున్న అఖిలేష్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జరిగిన ఐదు దశల ఎన్నికల్లో ఎస్పీ ఆధిక్యం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జరగబోయే ఆరు, ఏడో దశల ఎన్నికల్లోనూ తమ పార్టీకి అనుకూలంగా ఉంటుందని చెప్పారు.

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ విజయం సాధిస్తుందని స్పష్టంగా తెలుస్తోందని, తుది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని అఖిలేష్ అన్నారు. 300 సీట్లు గెలుస్తామని చెప్పుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఇప్పుడు పొత్తుల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. యూపీలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ మోదీ ఎన్నికల ర్యాలీలలో పాల్గొన్నా, తమదే విజయమని, సంపూర్ణ మెజార్టీ సాధించి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశి నియోజకవర్గంలో ఎస్పీ-కాంగ్రెస్ కూటమి ముందంజలో ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement