ఆగ్రాలో మరో దిమాపూర్ ఘటన

ఆగ్రాలో మరో దిమాపూర్ ఘటన - Sakshi


ఆగ్రాలో మరో దిమాపూర్ తరహా ఘటన జరిగింది. తాగి.. అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ వ్యక్తిని జనం అతడి ఇంట్లోంచి బయటకు లాగి.. చితక్కొట్టి చంపేశారు. కొన ఊపిరితో ఉన్న అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి పేరు జీతు అని స్థానికులు తెలిపారు. అతడిని ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా కొట్టేశారని, ఇంట్లోంచి బయటకు లాగి, కర్రలతో బాదేశారని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఆగ్రహావేశాలతో ఉన్న జనాన్ని ఎవరూ ఆపలేకపోయారని కూడా తెలిపారు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది అమ్మాయిలు, మహిళల పట్ల జీతు కొంత కాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడన్న ఆరోపణలున్నాయని, ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే మరణించినట్లు వైద్యులు చెప్పారని.. పోలీసులు అన్నారు. నాగాలాండ్లోని దిమాపూర్ నగరంలో వేలాదిమంది జైలు గేట్లు విరగ్గొట్టి మరీ ఓ వ్యక్తిని చంపిన ఘటన జరిగి పట్టుమని పది రోజులు కూడా పూర్తికాకముందే ఇదే తరహాలో ఆగ్రా ఘటన జరగడం గమనార్హం.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top