న్యూడ్‌ సీన్లపై హీరోయిన్‌ సంజన వివరణ | actress sanjana response on dandupalya scenes | Sakshi
Sakshi News home page

న్యూడ్‌ సీన్లపై హీరోయిన్‌ సంజన వివరణ

Jul 19 2017 9:39 PM | Updated on Apr 3 2019 9:14 PM

న్యూడ్‌ సీన్లపై హీరోయిన్‌ సంజన వివరణ - Sakshi

న్యూడ్‌ సీన్లపై హీరోయిన్‌ సంజన వివరణ

దండుపాళ్యం-2 సినిమాలోని వివాదాస్పద నగ్న దృశ్యాలపై హీరోయిన్‌ సంజన వివరణ ఇచ్చారు.

బెంగళూరు: త్వరలో విడుదల కానున్న దండుపాళ్యం-2 సినిమాలోని వివాదాస్పద నగ్న దృశ్యాలపై హీరోయిన్‌ సంజన వివరణ ఇచ్చారు. బుధవారం బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆమె.. సినిమాలో అలాంటి సీన్లు చేయాల్సి ఉంటుందని తనతో దర్శకనిర్మాతలు ముందే చెప్పారని అన్నారు. అయితే సదరు దృశ్యాల చిత్రీకరణ సమయంలో తాను నిండుగా దుస్తులు ధరించానని, ఆ తర్వాత గ్రాఫిక్స్‌ ద్వారా వాటిని నగ్నంగా ఉన్నట్లు చూపించారని తెలిపింది.

అయితే అశ్లీలత ఎక్కువైందనే కారణంగా దండుపాళ్యం 2లోని ఆ దృశ్యాలకు సెన్సార్‌ బోర్డు కట్‌ చెప్పడం, వాటిని తొలిగించిన మీదట సినిమా విడుదలకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించడం తెలిసిందే. కానీ అంతలోనే తొలగించిన సీన్లు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం కావడంతో సినిమాపై వివాదం రాజుకుంది. ఆ దృశ్యాలు ఎలా లీకయ్యాయో తెలియదని హీరోయిన్‌ సంజన చెప్పుకొచ్చారు.

దర్శకుడిపై ఫిర్యాదు
లీకైన వీడియోలపై దుమారం కొనసాగుతుండగానే, దండుపాళ్యం దర్శకుడిపై కన్నడ చిత్రసీమలో ఆగ్రహం వ్యక్తమైంది. ఒక నటిని నగ్నంగా చూపించడంపై కొందరు చిత్రమండలిలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement