ఐటెం సాంగ్‌కు కళ్లుచెదిరే రెమ్యూనరేషన్‌! | actress paid a whopping SUM for a song | Sakshi
Sakshi News home page

ఐటెం సాంగ్‌కు కళ్లుచెదిరే రెమ్యూనరేషన్‌!

Mar 22 2017 9:31 AM | Updated on Aug 3 2019 12:45 PM

ఐటెం సాంగ్‌కు కళ్లుచెదిరే రెమ్యూనరేషన్‌! - Sakshi

ఐటెం సాంగ్‌కు కళ్లుచెదిరే రెమ్యూనరేషన్‌!

2016లో ’సరైనోడు’ వంటి సూపర్‌హిట్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి ఇప్పుడు మంచి అవకాశాలే వస్తున్నాయి

నటి క్యాథరిన్‌ ట్రెసా టాలీవుడ్‌లో దూసుకుపోతోంది. 2016లో ’సరైనోడు’ వంటి సూపర్‌హిట్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి ఇప్పుడు మంచి అవకాశాలే వస్తున్నాయి. ’ఖైదీ నంబర్‌ 150’ వంటి ప్రతిష్టాత్మకమైన సినిమా నుంచి తప్పుకున్నా.. ఈ భామ కెరీర్‌కు పెద్దగా రిస్క్‌ ఎదురుకాలేదు. బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న తాజా సినిమాలో ఓ స్పెషల్‌ నంబర్‌ కోసం క్యాథరిన్‌ను తీసుకున్నారు.

లావిష్‌గా తెరకెక్కిస్తున్న ఈ ఐటెంసాంగ్‌ కోసం ఈ అమ్మడికి కళ్లుచెదిరే రీతిలో రూ. 65 లక్షలు చెల్లించినట్టు తెలుస్తోంది. క్యాథరిన్‌కు ఇది నిజంగా చాలా పెద్దమొత్తమే. పూర్తి సినిమా చేసిన ఇంతస్థాయిలో ఆమెకు రెమ్యూనరేషన్‌ దక్కేది కాదని, కానీ ఒక్క పాట కోసమే రూ. 65 లక్షలు ఇస్తుండటం పెద్ద విషయమని అని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. క్యాథరిన్‌ మంచి డ్యాన్సర్‌ కావడం.. పాటకు సరిపోయే అందచందాలు తనకు ఉండటంతోనే పెద్దమొత్తంలో చెల్లించారని ఆ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌, ప్రగ్యా జైస్వల్‌ హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement