మళ్లీ జైలుకు సంజయ్దత్ | Actor Sanjay Dutt furlough ends, to go back to Yerwada jail today | Sakshi
Sakshi News home page

మళ్లీ జైలుకు సంజయ్దత్

Jan 8 2015 1:02 PM | Updated on Sep 2 2017 7:24 PM

మళ్లీ జైలుకు సంజయ్దత్

మళ్లీ జైలుకు సంజయ్దత్

రెండు వారాల బెయిల్ గడువు ముగియడంతో బాలీవుడ్ నటుడు సంజయ్దత్ గురువారం తిరిగి జైలుకెళ్లనున్నారు.

ముంబై: రెండు వారాల బెయిల్ గడువు ముగియడంతో బాలీవుడ్ నటుడు సంజయ్దత్ గురువారం తిరిగి జైలుకెళ్లనున్నారు. గడువు పొడిగించాలని దత్ చేసుకున్న అప్పీలు వారం గడిచినా... దీనిపై జైలు అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన తరఫు న్యాయవాది హితేష్ జైన్ వెల్లడించారు. పుణే జైలు నుంచి ముంబైకి ఎటువంటి పత్రాలు అందలేదని తెలిపారు.

1993లో ముంబై వరుస బాంబు పేలుళ్లు కేసుకు సంబంధించి... అక్రమ ఆయుధాల కేసులో సంజయ్ దత్ కు సుప్రీంకోర్టు అయిదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. పుణెలోని ఎరవాడ జైలులో సంజయ్ దత్ శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. 2013 మే నుంచి 2014 మే మాసం వరకు దాదాపు 100 రోజులు బెయిల్పై జైలు నుంచి సంజయ్ బయటకు వచ్చారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement