మోడల్‌పై మాజీ ప్రియుడి యాసిడ్ దాడి | acid attack may cause visual impairedness to former beauty queen | Sakshi
Sakshi News home page

మోడల్‌పై మాజీ ప్రియుడి యాసిడ్ దాడి

Mar 9 2017 12:58 PM | Updated on Aug 17 2018 2:10 PM

మోడల్‌పై మాజీ ప్రియుడి యాసిడ్ దాడి - Sakshi

మోడల్‌పై మాజీ ప్రియుడి యాసిడ్ దాడి

ఆమె మాజీ బ్యూటీక్వీన్. ఇప్పుడు కూడా టాప్ మోడళ్లలో ఒకరు. అలాంటి మోడల్‌పై యాసిడ్ దాడి జరిగింది.

ఆమె మాజీ బ్యూటీక్వీన్. ఇప్పుడు కూడా టాప్ మోడళ్లలో ఒకరు. అలాంటి మోడల్‌పై యాసిడ్ దాడి జరిగింది. ఆ దాడి చేసింది కూడా ఎవరో కాదు.. ఆమె మాజీ బోయ్‌ఫ్రెండు. మాజీ మిస్ ఇటలీ అయిన జెస్సికా నొటారో ముఖంపై అతడు యాసిడ్ పోయడంతో ఇప్పుడు ఆమె కంటిచూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. టీవీ ప్రెజెంటర్‌గాను, డాల్ఫిన్ల శిక్షకురాలిగా కూడా పనిచేసిన నొటారోకు ప్లాస్టిక్ సర్జరీ చేస్తామని వైద్యులు చెబుతున్నారు. యాసిడ్ దాడితో ఆమె తీవ్రంగా గాయపడటంతో సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె నిలకడగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఆమె ముఖం మీద, కళ్లలోకి బాగా లోపలి వరకు యాసిడ్ గాయాలు కావడంతో.. ప్లాస్టిక్ సర్జరీ తప్పడం లేదని, ఆమె కాళ్ల మీద, పిరుదుల మీద కూడా యాసిడ్ పడిందని చెబుతున్నారు. నిందితుడు, నొటారో మాజీ బోయ్‌ఫ్రెండు జార్జ్ ఎడ్సన్ టవారెస్‌ను అరెస్టు చేశారు. అయితే, తాను ఆ దాడి చేయలేదని అతడు వాదిస్తున్నాడు. ఒక అక్వేరియంలోని డాల్ఫిన్‌ షోలో పనిచేసే సమయంలో 2014లో ఎడ్సన్‌ను నొటారో తొలిసారి కలిసింది. రెండేళ్ల బంధం అనంతరం ఇద్దరూ గత వేసవిలో విడిపోయినా, అతడు తరచు వెంటపడుతూ వేధిస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వెంటపడటం మాత్రం మానలేదు. ఇన్ని బాధలు ఉన్నా నొటారో ఎప్పుడూ నవ్వుతూనే ఉండేదని, ఆశాభావంతో ఉండేదని స్నేహితులు చెప్పారు. ఆమె మంచి గాయని, డాన్సర్ కూడా అని, తరచు టీవీ షోలలో కనిపించేదని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement