8 ఏళ్ల బాలికపై అత్యాచారం | 8-year-old raped on Madarsa's rooftop | Sakshi
Sakshi News home page

8 ఏళ్ల బాలికపై అత్యాచారం

Dec 25 2014 3:29 PM | Updated on Jul 28 2018 8:51 PM

8 ఏళ్ల బాలికపై అత్యాచారం - Sakshi

8 ఏళ్ల బాలికపై అత్యాచారం

మదర్సాలో 8 ఏళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్ లోని సంగనేర్ ప్రాంతంలో బుధవారం చోటు చేసుకుంది.

జైపూర్: మదర్సాలో 8 ఏళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్ లోని సంగనేర్ ప్రాంతంలో బుధవారం చోటు చేసుకుంది. మదర్సాకు వెళ్లిన బాలికను భవనంపైకి (రూప్ టాప్) తీసుకెళ్లి దుండగుడు ఈ ఆఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలు ఇంటికి తిరిగొచ్చి తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధితురాలిని జేకే లోన్ ఆస్పత్రికి తరలించారు. ఆమెపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement