ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి | 7 killed, 25 injured in car-bus collision | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి

Feb 25 2014 2:42 PM | Updated on Sep 2 2017 4:05 AM

మధ్యప్రదేశ్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మెరైన - అంబ జాతీయ రహదారిపై బర్హగాం సమీపంలో మాజీ కార్పోరేటర్ కారు ఎదురుగా వస్తున్న బస్సు ఢీ కొట్టింది.

మధ్యప్రదేశ్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మెరైన - అంబ జాతీయ రహదారిపై బర్హగాం సమీపంలో మాజీ కార్పోరేటర్ కారు ఎదురుగా వస్తున్న బస్సు ఢీ కొట్టింది. ఆ దుర్ఘటనలో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆ ఘటనలో 25 మంది గాయపడ్డారని తెలిపారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారన్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.

 

మాజీ కార్పొరేటర్ కుటుంబం కారులో పోర్సాలోని బంధువుల పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆ ప్రమాదం  చోటు చేసుకుందన్నారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలతోపాటు బస్సులోని ఓ ప్రయాణికుడు అక్కడికక్కడే మరణించారన్నారు. మృత దేహలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిర్వహించి అనంతరం బంధువులకు అప్పగించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement