నివాస భవనంలో అగ్నిప్రమాదం: ఏడుగురు మృతి | 7 killed, 12 injured in fire accident in China | Sakshi
Sakshi News home page

నివాస భవనంలో అగ్నిప్రమాదం: ఏడుగురు మృతి

Jul 12 2015 9:22 AM | Updated on Sep 5 2018 9:45 PM

మధ్య చైనా హుబి ప్రావిన్స్లోని ఓ నివాస భవంతిలో శనివారం అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

బీజింగ్: మధ్య చైనా హుబీ ప్రావిన్స్లోని ఓ నివాస భవంతిలో శనివారం అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మరో 12 మంది గాయపడ్డారని ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు పేర్కొన్నారు.

భవంతిలో అగ్నిప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో వచ్చి మంటలార్పారని చెప్పారు. ఈ ప్రమాద ఘటనకు కారణాలు తెలియరాలేదన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement