64 మంది ఆకతాయిల అరెస్టు | 64 held in Mumbai for 'indecent behaviour' | Sakshi
Sakshi News home page

64 మంది ఆకతాయిల అరెస్టు

Aug 9 2015 3:59 PM | Updated on Sep 3 2017 7:07 AM

64 మంది ఆకతాయిల అరెస్టు

64 మంది ఆకతాయిల అరెస్టు

అసభ్యంగా ప్రవర్తిస్తున్న 64మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వారికి కొంత మొత్తంలో ఫైన్ వేసి, తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పించి పంపించారు

ముంబయి: అసభ్యంగా ప్రవర్తిస్తున్న 64మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత వారికి కొంత మొత్తంలో ఫైన్ వేసి, తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పించి పంపించారు. ఈ ఘటన ముంబయిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మదా ఐలాండ్, అక్సా బీచ్ వద్ద గల కొన్ని హోటల్లలో కొంతమంది యువతీయువకులు జంటలుగా ఏర్పడి అసభ్యంగా ప్రవర్తిస్తూ తోటివారికి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించారు.

దీంతో అక్కడే ఉన్న కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి ఆ ప్రాంతంలోని హోటళ్లు, లాడ్జీలు, రెస్టారెంట్లు రిసార్టులపై దాడులు నిర్వహించి మొత్తం 64మందిని అదుపులోకి తీసుకున్నారు. ఒక్కొక్కరికి రూ.1200 ఫైన్ వేయడంతోపాటు వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి నేరుగా కౌన్సెలింగ్ ఇప్పించి పంపించేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement