సాల్మన్ దీవుల్లో భూకంపం | 6.9-magnitude quake strikes off Solomon Islands: USGS | Sakshi
Sakshi News home page

సాల్మన్ దీవుల్లో భూకంపం

May 21 2015 9:18 AM | Updated on Aug 24 2018 7:34 PM

సాల్మన్ దీవుల్లో భూకంపం - Sakshi

సాల్మన్ దీవుల్లో భూకంపం

పసిఫిక్ మహాసముద్రంలోని సాల్మన్ దీవుల్లో గురువారం భూకంపం సంభవించింది.

సిడ్నీ : పసిఫిక్ మహాసముద్రంలోని సాల్మన్ దీవుల్లో గురువారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.9గా నమోదైంది. భూకంపం భూమి లోపల 19 కిలోమీటర్ల లోతులో ఏర్పడింది. ఈమేరకు అమెరికా జియాలజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. సునామీ ప్రమాదం లేదని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. ప్రపంచంలో భూకంపం వచ్చే ప్రాంతాల్లో ఇది ఒక్కటని పేర్కొంది. గత మూడేళ్ల కాలవ్యవధిలో దాదాపు 30 స్వల్ప భూకంపాలు సంభవించాయని యూఎస్ జియోలాజికల్ సర్వే చెప్పింది.

Advertisement
 
Advertisement
Advertisement