టోక్యో: జపాన్‌లో 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం జపాన్ ఈశాన్య తీరానికి సమీపంగా ఈ భూకంపం సంభవించిందని చెప్పారు. రవాణా సేవలకు అంతరాయం ఏర్పడిందని అన్నారు. తీర ప్రాంతాల నుంచి ప్రజలు దూరంగా వెళ్లాలని కోరారు.
జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం.. ఈ భూకంపం పసిఫిక్ మహాసముద్రంలో 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఇవాటే, ఆఓమోరి, హొక్కైడో ప్రిఫెక్చర్ ప్రాంతాల తీర ప్రాంతాల్లో గరిష్ఠంగా 3 మీటర్ల ఎత్తుకి సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
ప్రధాన మంత్రి సనఏ తకైచి అత్యవసర సిబ్బందిని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
కొనసాగుతున్న నౌకల తరలింపు
జపాన్‌లోని ఉత్తర తోహోకు ప్రాంతంలో ఉన్న ఒక ప్రధాన పారిశ్రామిక, వాణిజ్య రేవు ‘హచినోహే పోర్ట్’ నుంచి నౌకలు వెంటనే తరలిపోవాలని అత్యవసర హెచ్చరికలు జారీ అయ్యాయి. అధికారులు తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. అలలు త్వరలో తీరానికి చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. టోక్యో నుంచి ఆఓమోరి వరకు బుల్లెట్ రైలు సేవలను భూకంపం తర్వాత నిలిపివేశారు.
Massive 7.4 magnitude Earthquake in Japan . Tsunami warning issued .#JapanEarthquake pic.twitter.com/tpFJJhkU45
— Bengal's untold tales (@Gramergolpo) April 20, 2026
Massive 7.4 magnitude Earthquake in Japan . Tsunami warning issued .#JapanEarthquake pic.twitter.com/QccDeThlbd
— God (@Indic_God) April 20, 2026
Breaking News: Powerful 7.5 magnitude earthquake strikes northeastern Japan, triggering tsunami warnings and mass evacuations.#wicnews #JapanEarthquake #TsunamiWarning #BreakingNews pic.twitter.com/V25Zecd6Tu
— WIC News (@WIC_News) April 20, 2026


