జమ్ము కశ్మీర్లో మరో విషాదం | 5 Army soldiers killed, who trapped under snow | Sakshi
Sakshi News home page

జమ్ము కశ్మీర్లో మరో విషాదం

Jan 30 2017 4:56 PM | Updated on Sep 5 2017 2:29 AM

జమ్ము కశ్మీర్లో మరో విషాదం

జమ్ము కశ్మీర్లో మరో విషాదం

జమ్ము కశ్మీర్లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో మరో ఐదుగురు సైనికులు మరణించారు.

శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో మరో ఐదుగురు సైనికులు మరణించారు. సోమవారం మచిల్‌ సెక్టార్లో ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. సైనికుల మృతదేహాలను మంగళవారం వారి స్వస్థలాలకు పంపుతామని ఉన్నతాధికారులు చెప్పారు.

ఈ నెల 28న మచిల్‌ సెక్టార్లో మంచు చరియలు విరిగిపడటంతో సైనికులు గల్లంతయ్యారు. వీరి కోసం సైన్యం గాలింపు చర్యలు చేపట్టగా, ఈ రోజు మృతదేహాలు లభ్యమయ్యాయి. కశ్మీర్లో ఇటీవల పలు ప్రాంతాల్లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో 20 మంది మరణించిన సంగతి తెలిసిందే. వీరిలో 14 మంది సైనికులు ఉన్నారు. మరికొంత మంది సైనికులు గాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement