మహిళపై డ్రైవర్, కండక్టర్ గ్యాంగ్ రేప్ | 40-year-old woman gangraped by bus driver, conductor | Sakshi
Sakshi News home page

మహిళపై డ్రైవర్, కండక్టర్ గ్యాంగ్ రేప్

Sep 29 2015 2:52 PM | Updated on Sep 3 2017 10:11 AM

ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. బస్సులో ఓ మహిళపై డ్రైవర్, కండక్టర్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

ఝాన్సీ: ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. బస్సులో ఓ మహిళపై డ్రైవర్, కండక్టర్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

సోమవారం రాత్రి కొట్వాలి ప్రాంతంలో 40 ఏళ్ల మహిళ బస్సు కోసం ఎదురు చూస్తుండగా, ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ బ్రీజేంద్ర, కండక్టర్ జితేంద్ర ఆమెను బలవంతంగా బస్సులోకి లాక్కెళ్లారు. అనంతరం ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలు అలారం మోగించడంతో స్థానికులు వచ్చి నిందితులను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement