29 ఏళ్లకే బామ్మయ్యింది.. | 29-year-old becomes grandmother in Argentina | Sakshi
Sakshi News home page

29 ఏళ్లకే బామ్మయ్యింది..

Nov 6 2015 6:42 PM | Updated on Sep 3 2017 12:08 PM

అర్జెంటీనాలో 29 ఏళ్ల యువతి బామ్మయ్యింది. ఆమె 14 ఏళ్ల కొడుకు తండ్రయ్యాడు.

బ్రూనో ఎయిర్స్: సమాజంలో మారిన పరిస్థితుల వల్ల 29 ఏళ్ల వయసు యువతులు చాలా మంది అవివాహితులుగానే ఉంటున్నారు. చదువు, ఉద్యోగం, బాధ్యతలు వల్ల లేటు వయసు వివాహాలు పెరుగుతున్నాయి. అర్జెంటీనాలో 29 ఏళ్ల యువతి బామ్మయ్యింది. ఆమె 14 ఏళ్ల కొడుకు తండ్రయ్యాడు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా నిజం!

అర్జెంటీనాలోని మెండోజా రాష్ట్రంలోని శాన్ రఫెల్ నగరంలో లుసియా డిసిరీ పాస్టెనెజ్ (29).. తన కొడుకు (14) తండ్రి అయ్యాడని చెప్పింది. తన కొడుకు స్కూల్కు వెళుతూనే..  మనవడి బాగోగులు చూసుకుంటున్నాడని  పాస్టెనెజ్ తెలిపింది. తన కొడుకు, అతని గర్ల్ఫ్రెండ్ విషయంలో తాను జోక్యం చేసుకోబోనని, వారిద్దరినీ పెళ్లి చేసుకోవాలని కానీ లేదా కలసి జీవించాలని కాని చెప్పనని వెల్లడించింది. తన కొడుకు గర్ల్ఫ్రెండ్ వారి ఇంట్లోనే ఉంటుందని తెలిపారు. తన కుమారుడికి అండగా ఉంటామని, అయితే టీనేజ్లో తండ్రి కావడం బాగోదని సలహా ఇచ్చారు. పాస్టెనెజ్కు నలుగురు పిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement