పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 20 మంది మృతి | 20 pilgrims killed in Punjab accident | Sakshi
Sakshi News home page

పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 20 మంది మృతి

Oct 10 2013 12:27 PM | Updated on Sep 1 2017 11:31 PM

పంజాబ్లోని హోషియార్పూర్ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది యాత్రికులు మృతి చెందారు.

పంజాబ్లోని హోషియార్పూర్ సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది యాత్రికులు మృతి చెందారని జిల్లా పోలీసు ఉన్నతాధికారి సుఖ్చైన్ సింగ్ గిల్ వెల్లడించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని తెలిపారు. ఆ ఘటనలో మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు.

 

క్షతగాత్రులను హోషియార్పూర్ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. పంజాబ్ - హిమాచల్ప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని యాత్రస్థలిని సందర్శించుకుని తిరిగి స్వస్థలానికి ప్రయాణమై వస్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. బాధితులంతా కపుర్తల జిల్లాలోని బొలత్ ప్రాంతానికి చెందిన వారని వివరించారు. పర్వత ప్రాంతంలో ఆ ప్రమాదం చోటు చేసుకోవడంతో సహాయక చర్యలు కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని పోలీసులు అధికారులు వివరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement