అమృత్‌పాల్‌ కోసం డ్రోన్‌తో గాలింపు | Sakshi
Sakshi News home page

అమృత్‌పాల్‌ కోసం డ్రోన్‌తో గాలింపు

Published Fri, Mar 31 2023 5:47 AM

Drones deployed to hunt Amritpal Singh in Punjab - Sakshi

హోషియార్‌పూర్‌:  వివాదాస్పద సిక్కు మత బోధకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ జాడ కోసం పంజాబ్‌ పోలీసులు వేట ముమ్మరం చేశారు. గురువారం డ్రోన్‌ను రంగంలోకి దించారు. హోషియార్‌పూర్‌ జిల్లాలోని మర్నాయిన్‌ గ్రామంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్రోన్‌తో గాలింపు చర్యలు చేపట్టారు.

రెండు రోజుల క్రితం ఇదే గ్రామంలో కొందరు అనుమానితులు తమకారును వదిలేసి పారిపోయారు. వారిలో అమృత్‌పాల్‌ ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా, తాను ఎక్కడికీ పారిపోలేదని, త్వరలోనే ప్రపంచం ఎదుటకు వస్తానని అమృత్‌పాల్‌ వెల్లడించాడు. ఈ మేరకు గురువారం మరో వీడియో తెరపైకి వచ్చింది. చావంటే తనకు భయం లేదని ఆ వీడియోలో వ్యాఖ్యానించాడు.  

Advertisement
 
Advertisement
 
Advertisement