Sakshi News home page

స్పీడ్ గా 'స్మార్ట్' అవుతున్నారు!

Published Mon, Jul 28 2014 11:18 AM

స్పీడ్ గా 'స్మార్ట్' అవుతున్నారు! - Sakshi

ప్రపంచం ఇప్పుడు అన్నింటా 'స్మార్ట్' జపం చేస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు మరీ బక్కచిక్కిపోతున్నాయి. సన్నవాటికే మన్నన దక్కుతోంది. దీంతో 'స్మార్ట్'కు క్రేజ్ పెరిగింది. దీంతో ప్రపంచమంతా 'స్మార్ట్'గా మారిపోతోంది. సెల్ఫోన్లు అయితే వేగంగా మారిపోతున్నాయి. రోజుకో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి విడుదలవుతోంది. విభిన్న రకాల ఫీచర్లతో వినియోగదారులను కట్టిపడేస్తున్నాయి. అందుబాటులో ధరలో దొరుకుతుండడం, విడతలవారీగా డబ్బులు చెల్లించి ఫోన్లు కొనుక్కునే సౌలభ్యంతో స్మార్ట్ ఫోన్లకు గిరాకీ పెరిగింది.

స్మార్ట్ ఫోన్లు వినియోగించే వారి సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ముగ్గురు చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటోంది. 2015 నాటికి 250 కోట్ల మంది చేతుల్లో స్మార్ట్ ఫోన్లు సందడి చేయనున్నాయని ఒక అంచనా. అంటే ప్రపంచ జనాభాలో 35 శాతం మంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటాయన్న మాట.

స్మార్ట్ ఫోన్లు వినియోగదారుల సంఖ్య 2012 నాటికే 100 కోట్లను దాటింది. 2013 చివరి నాటికి 'స్మార్ట్' యూజర్లు 190 కోట్లకు చేరారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే వీరి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు అమెరికా చెందిన స్ట్రాటజీ ఎనలిటిక్స్ పేర్కొంది. లో-ఎండ్ ఫోన్లు అందుబాటులోకి రావడమే దీనికి కారణమని వెల్లడించింది. అయితే హైటెక్ ఫోన్ల వినియోగంలో యూరప్, అమెరికా ముందున్నాయి.

Advertisement
Advertisement