breaking news
Strategy Analytics
-
శాంసంగ్‌పై ప్రేమ.. షావోమిపై నమ్మకం
న్యూఢిల్లీ : ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి స్మార్ట్‌ఫోన్ ఓ నిత్యావసర వస్తువులా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్‌కు రోజురోజుకు అంతలా పెరుగుతుంది ఆదరణ. ఈ డిమాండ్, ఆదరణతో రోజుకో కొత్త బ్రాండ్.. రోజుకో కొత్త మోడల్‌తో మార్కెట్లోకి వస్తోంది. ఎన్ని బ్రాండ్లు వస్తున్నప్పటికీ.. మన దేశంలో షావోమి, శాంసంగ్‌లకు ఉన్న క్రేజే వేరు. ఈ రెండు బ్రాండెండ్ ఫోన్లకు మార్కెట్లో తెగ డిమాండ్ ఉంటుంది. ఇటీవల విడుదలైన స్ట్రాటజీ అనలిటిక్స్ అధ్యయన రిపోర్టులో కూడా ఇదే వెల్లడైంది. ‘ఇండియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పర్సెప్షన్స్ అండ్ క్యారెక్టర్‌స్టిక్స్’ పేరుతో స్ట్రాటజీ అనలిటిక్స్ విడుదల చేసిన రిపోర్టులో భారతీయులు ఎక్కువగా కొనుక్కోవాలనుకుంటున్న ఫోన్లలో షావోమి, శాంసంగ్లే టాప్ బ్రాండ్లుగా నిలిచాయి. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుక్కోవాలనుకున్నప్పుడు చాలా మంది వినియోగదారులు ఈ బ్రాండ్లకే మొగ్గుచూపుతున్నారని ఈ రిపోర్టు పేర్కొంది. ఇక వీటి తర్వాత వన్‌ప్లస్ ఫోన్లపై ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపింది. షావోమి నమ్మకమైన బ్రాండ్‌గా, తేలికగా ఉపయోగించుకునే బ్రాండ్‌గా యూజర్లుగా పేర్కొనగా... శాంసంగ్ తాము ప్రేమించే బ్రాండ్‌గా, తమ అవసరాలను అర్థం చేసుకునే బ్రాండ్‌గా పేర్కొన్నట్టు రిపోర్టు వెల్లడించింది. ఇక చైనా బ్రాండ్ ఫోన్లకు కూడా భారత్‌లో బాగా గిరాకీ పెరుగుతున్నట్టు తెలిపింది. అదేవిధంగా 60 శాతం ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్లు 12 నెలల్లోగా మార్చేయాలని అనుకుంటున్నట్టు పేర్కొంది. షావోమి, వన్‌ప్లస్ వంటి చైనీస్ బ్రాండ్లు భారత మార్కెట్లో మంచి ప్రతిభను కనబరుస్తున్నాయని, ఇతర గ్లోబల్ కంపెనీలు ఎల్జీ, సోనీ, హువావేలు ఒత్తిడిలో కొనసాగుతున్నట్టు రిపోర్టు తెలిపింది. ఇటీవల స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడంలో ప్రధాన పాత్ర పోషించేది ఆ ఫోన్ బ్యాటరీ లైఫ్ అని, కెమెరా క్వాలిటీపై కాదని రిపోర్టు హైలెట్ చేసింది. -
స్పీడ్ గా 'స్మార్ట్' అవుతున్నారు!
ప్రపంచం ఇప్పుడు అన్నింటా 'స్మార్ట్' జపం చేస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు మరీ బక్కచిక్కిపోతున్నాయి. సన్నవాటికే మన్నన దక్కుతోంది. దీంతో 'స్మార్ట్'కు క్రేజ్ పెరిగింది. దీంతో ప్రపంచమంతా 'స్మార్ట్'గా మారిపోతోంది. సెల్ఫోన్లు అయితే వేగంగా మారిపోతున్నాయి. రోజుకో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి విడుదలవుతోంది. విభిన్న రకాల ఫీచర్లతో వినియోగదారులను కట్టిపడేస్తున్నాయి. అందుబాటులో ధరలో దొరుకుతుండడం, విడతలవారీగా డబ్బులు చెల్లించి ఫోన్లు కొనుక్కునే సౌలభ్యంతో స్మార్ట్ ఫోన్లకు గిరాకీ పెరిగింది. స్మార్ట్ ఫోన్లు వినియోగించే వారి సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ముగ్గురు చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటోంది. 2015 నాటికి 250 కోట్ల మంది చేతుల్లో స్మార్ట్ ఫోన్లు సందడి చేయనున్నాయని ఒక అంచనా. అంటే ప్రపంచ జనాభాలో 35 శాతం మంది దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటాయన్న మాట. స్మార్ట్ ఫోన్లు వినియోగదారుల సంఖ్య 2012 నాటికే 100 కోట్లను దాటింది. 2013 చివరి నాటికి 'స్మార్ట్' యూజర్లు 190 కోట్లకు చేరారు. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే వీరి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు అమెరికా చెందిన స్ట్రాటజీ ఎనలిటిక్స్ పేర్కొంది. లో-ఎండ్ ఫోన్లు అందుబాటులోకి రావడమే దీనికి కారణమని వెల్లడించింది. అయితే హైటెక్ ఫోన్ల వినియోగంలో యూరప్, అమెరికా ముందున్నాయి.