లోయలో పడిన బస్సు: 17 మంది మృతి | 17 killed, 30 wounded in Kashmir road accident | Sakshi
Sakshi News home page

లోయలో పడిన బస్సు: 17 మంది మృతి

May 20 2014 8:35 AM | Updated on Sep 2 2017 7:37 AM

బస్సు లోయలోపడి 17 మంది ప్రయాణికులు మృతి చెందిన ఘటన జమ్మూ కాశ్మీర్ రాంబన్ జిల్లా డిగ్డోల్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

బస్సు లోయలోపడి 17 మంది ప్రయాణికులు మృతి చెందిన ఘటన జమ్మూ కాశ్మీర్ రాంబన్ జిల్లా డిగ్డోల్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. ఆ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. క్షతగాత్రులను హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.

 

బస్సు జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు.డ్రైవర్ బస్సును వేగంగా నడపడం వల్లే ఆ ప్రమాదం చోటు చేసుకుందని వివరించరు. బస్సు ప్రయాణికుల్లో అత్యధికులు పూంచ్, రాజోరి జిల్లాలకు చెందిన యవతేనని ఆయన స్పష్టం చేశారు. వారంతా రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఆ ప్రమాదం సంభవించిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement