లోయలో పడ్డ బస్సు: 15 మంది మృతి | 15 dead in Himachal bus accident | Sakshi
Sakshi News home page

లోయలో పడ్డ బస్సు: 15 మంది మృతి

Sep 27 2013 9:58 AM | Updated on Sep 1 2017 11:06 PM

హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఓ మిని బస్సు అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో 15 మంది మరణించారని పోలీసు ఉన్నతాధికారి ఖజానా రామ్ శుక్రవారం వెల్లడించారు.

హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఓ మిని బస్సు అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో 15 మంది మరణించారని పోలీసు ఉన్నతాధికారి ఖజానా రామ్ శుక్రవారం వెల్లడించారు. ఆ సంఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. వారిని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారన్నారు.

 

బస్సు ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. ఉచా టిక్కర్ నుంచి రేణుకా జీ పట్టణానికి వెళ్తుండగా జబ్రగ్ గ్రామం వద్ద ఆ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. రోడ్డు సమీపంలో 500 అడుగుల లోతు ఉన్న లోయలో పడటంతో ప్రయాణికులు మరణించి ఉండవచ్చని పోలీసు ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement