
రానా దగ్గుపాటి
సనత్‌నగర్: సినీహీరో రానా దగ్గుపాటి బేగంపేటలో బుధవారం సందడి చేశారు. రిలయన్స్ ట్రెండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయన్ను సంస్థ ప్రకటించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రానా మాట్లాడుతూ.. అన్ని వర్గాల వారికి అవసరమైన దుస్తులు రిలయన్స్ ట్రెండ్జ్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. కాగా రానాపై ముంబైకి చెందిన శాండ్ ఆర్టిస్ట్ వేసిన చిత్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సంస్థ మార్కెటింగ్ హెడ్ కపిల్ కట్టర్ పాల్గొన్నారు.