రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.6 లక్షలు ఇస్తామని ప్రకటన చేయడం బాగానే ఉన్నప్పటికీ.. దాన్ని వెంటనే ఆచరణలో పెట్టాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్ల సూర్యప్రకాశ్ ప్రభుత్వాన్ని కోరారు.
సుల్తానాబాద్ (కరీంనగర్) : రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.6 లక్షలు ఇస్తామని ప్రకటన చేయడం బాగానే ఉన్నప్పటికీ.. దాన్ని వెంటనే ఆచరణలో పెట్టాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్ల సూర్యప్రకాశ్ ప్రభుత్వాన్ని కోరారు.
మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత నేత వైఎస్సార్ మరణించారనే సమాచారం విని తట్టుకోలేక మృతిచెందినవారి కుటుంబసభ్యులను పరామర్శించడం కోసం జగన్మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పరామర్శ యాత్రను జయప్రదం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.