breaking news
nalla suryaprakash
-
అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు: నల్లా
హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చిందుకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యాలయంలో పొంగులేటి...నల్లా సూర్యప్రకాశ్‌కు బీ ఫాం అందచేశారు. ఈ సందర్భంగా నల్లా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని ఆయన అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలే తమ ప్రచారాస్త్రాలుగా ప్రజల్లోకి వెళతామని నల్లా తెలిపారు. రైతులు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతుల బలవన్మరణాలను కనీసం నమోదు కూడా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళామన్నారు. -
'అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు'
-
ఖేడ్‌లో పోటీ..సై
బరిలో నిలబడదాం.. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నారాయణఖేడ్ ఉప ఎన్నికల బరిలో వైఎస్సార్సీపీ తరపున అభ్యర్థిని నిలబెట్టి పార్టీ సత్తా చాటుదామని కార్యకర్తలు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి సూచించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నారాయణఖేడ్ ప్రాంతంలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలే పార్టీకి అండ అని వారంతా తమ మనోగతాన్ని చాటారు. ఈ మేరకు పార్టీ నాయకుడు సంజీవరెడ్డి అధ్యక్షతన బుధవారం నారాయణఖేడ్‌లో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కేంద్ర పాలక మండలి సభ్యుడు నల్లా సూర్యప్రకాశ్, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్రా భిక్షపతి హాజరయ్యారు. ప్రధానంగా నారాయణఖేడ్ ఉప ఎన్నికపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా కార్యకర్తలు తమ మనోభావాలను పార్టీ నేతల ముందుంచారు. అభ్యర్థిని నిలబెట్టాల్సిందే.. నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాం గ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టాలని కా ర్యకర్తలు నేతలను కోరారు. వైఎస్సార్‌ను రాజకీయాలకతీతంగా అభిమానించే వారున్నారని, వారి అభిమానం ఓట్లు కురిపిస్తుందని కార్యకర్త లు తెలిపారు. వైఎస్.. రైతుల కోసం నల్లవాగు కాల్వల ఆధునీకరణ పనులు చేపట్టేందుకు ని ధులు విడుదల చేశారని, నీళ్లువృథాగా పోకుం డా నల్లవాగు నీటిని పది చెరువులకు మళ్లించేం దుకు చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఖేడ్‌కు డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు, వసతి గృహా లు మంజూరు చేశారన్నారు. మౌలిక సదుపాయాలకు నోచుకోని గిరిజన తండాల అభివృద్ధికి పాటుపడ్డారని వివరించారు. ఇవన్నీ ఉప ఎన్నికల్లో పార్టీకి కలిసివస్తాయనే ఆశాభావాన్ని కార్యకర్తలు వ్యక్తం చేశారు. ఇద్దరు చంద్రులు వాగ్దాన శూరులు నల్లా సూర్యప్రకాశ్ ధ్వజం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్ర సీ ఎం చంద్రబాబు నాయుడు ఇద్దరూ వాగ్దానశూరులేనని పార్టీ రాష్ట్ర నేత నల్లా సూర్యప్రకా శ్ ఎద్దేవా చేశారు. ‘డబుల్ బెడ్రూం’ హామీ తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు నియోజకవర్గానికి 400 ఇళ్లు మాత్రమే ఇస్తామని ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రస్తుత అంచనా ప్రకారం నారాయణఖేడ్ ని యోజకవర్గానికి 25 వేల ఇళ్లు అవసరమని, 400 చొప్పున ఇస్తే కేసీఆర్ ముని మనవని కాలం వరకు వచ్చినా సరిపోవన్నారు. వైఎస్సా ర్ తన హయాంలో అడిగిన ప్రతి వాళ్లకు ఇళ్లు ఇచ్చారన్నారు. దేశం మొత్తం మీద 47 లక్షల ఇళ్లు నిర్మిస్తే.. వైఎస్సార్ ఒక్కరే 47 లక్షల ఇళ్లు కట్టించారని గుర్తు చేశారు. దివంగత సీఎం వైఎస్సార్ తన హయాంలో ప్రతి అవ్వాతాతకు పింఛన్ ఇచ్చారని గుర్తు చేశారు. కార్యకర్తల అభిప్రాయాన్ని పార్టీ గౌరవిస్తుందని, వారి సూచనను అధినాయకత్వం ముందుం చుతామన్నారు. పార్టీ టేడ్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు నర్రా భిక్షపతి మాట్లాడుతూ రైతులపై కేసీఆర్‌కు ఏమాత్రం మమకారం లేదన్నారు. రాష్ట్రంలో 1500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆయనకు కనిపించడం లేదని, ఉప ఎన్నికల కోసం రూ వేల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు.సమావేశంలో సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి తడ్క జగదీశ్వర్‌గుప్త, జిల్లా కమిటీ సభ్యుడు ఇబ్రహీం, నారాయణఖేడ్ మండల పార్టీ అధ్యక్షుడు మానయ్య, సత్యనారాయణ (పెద్ద శంకరంపేట), శిరోమణి (కంగ్టి), విజయ్‌కుమార్ (కల్హేర్), సంజీవ్జాదవ్ (మనూర్), నేతలు అశోక్ పటేల్, సంగాగౌడ్, పాండు నాయక్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
'ప్రకటన సరే.. ఆచరణలో పెట్టండి'
సుల్తానాబాద్ (కరీంనగర్) : రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.6 లక్షలు ఇస్తామని ప్రకటన చేయడం బాగానే ఉన్నప్పటికీ.. దాన్ని వెంటనే ఆచరణలో పెట్టాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్ల సూర్యప్రకాశ్ ప్రభుత్వాన్ని కోరారు. మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత నేత వైఎస్సార్ మరణించారనే సమాచారం విని తట్టుకోలేక మృతిచెందినవారి కుటుంబసభ్యులను పరామర్శించడం కోసం జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పరామర్శ యాత్రను జయప్రదం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. -
రైతు ఆత్మహత్యలకు నిరనసగా వైఎస్సార్ సీపీ ఆందోళన
కరీంనగర్: రైతుల ఆత్మహత్యలను అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీసీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం రైతులతో ర్యాలీగా తరలివెళ్లి కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. అన్నదాతలను సర్కారు ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆత్మహత్యకు చేసుకున్న కుటుంబాలకు ప్రత్యేక సాయం అందజేయాలని ఆ పార్టీ నేతలు కోరారు. ఈ ధర్నాలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు బోయినపల్లి శ్రీనివాసరావు, అక్కినపల్లి కుమార్ తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు.