దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, సూర్యాపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ బీరవోలు సోమిరెడ్డి స్పష్టం చేశారు.
సూర్యాపేట, న్యూస్‌లైన్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, సూర్యాపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ బీరవోలు సోమిరెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు శుక్రవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నామినేషన్లు దాఖలు చేశారు. ర్యాలీనుద్దేశించి ఆయన మాట్లాడారు.
పట్టణంలోని ప్రతి ఓటరు ఏదో ఒక సంక్షేమ పథకంతో లబ్ధి పొందుతున్నారన్నారు. పట్టణ ప్రజల్లో తమపార్టీ పట్ల ఆదరణ ఉందన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు చిత్తశుద్ధి గల అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అభివృద్ధి చేయని నాయకులను ఓడించాలన్నారు. ఈ ర్యాలీ కొత్త బస్టాండ్ నుంచి డప్పు చప్పుళ్లు, మేళతాళాలతో బయలు దేరి మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకుంది.
ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు దొంతిరెడ్డి సైదిరెడ్డి, జిల్లా నాయకుడు దండ శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ మహిళా అధ్యక్షురాలు దంతాల భారతి, తండు భాస్కర్, కట్టా జ్ఞానయ్య, ఎండీ ఎజాస్, ఎస్‌కే నయీం, కొండ రవి, గోరెంట్ల సంజీవ, పిడమర్తి కల్యాణ్, శ్రీనివాస్,నాగుల్ మీరా, వెంకటేష్, పాండు, శ్రావణ్‌కుమార్, శివ తదితరులు పాల్గొన్నారు.