వైఎస్సార్ సీపీ కమిటీలో పలు నియామకాలు | YSR Congress Telangana committee some appointments | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ కమిటీలో పలు నియామకాలు

Jun 11 2016 2:10 AM | Updated on May 25 2018 9:20 PM

వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కమిటీలో శుక్రవారం పలు నియామకాలు జరిగాయి.

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కమిటీలో శుక్రవారం పలు నియామకాలు జరిగాయి. రాష్ర్ట పార్టీ ప్రధానకార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డిని ఖమ్మం జిల్లా పరిశీలకునిగా నియమించారు. నల్లగొండ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా తుమ్మలపల్లి భాస్కర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా బెంబడి శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు.

రాష్ట్రపార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా వెల్లాల రామ్మోహన్,రాష్ట్ర పార్టీ క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా కె.జార్జ్ హెర్బట్‌లను నియమించారు. రాష్ట్రపార్టీ కార్యదర్శులుగా ఎండీ సలీం, దొంతిరెడ్డి సైదిరెడ్డి(నల్లగొండ), కడారి బాలకృష్ణారెడ్డి (మెదక్), చిలకల అరుణారెడ్డి (రంగారెడ్డి), రమణబోయిన బ్రహ్మయ్య (హైదరాబాద్)లు నియమితులయ్యారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆయా నియామకాలను చేసినట్లు రాష్ట్రపార్టీ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement